సినిమా మొత్తం లిల్లీనే
రష్మిక మందన్న… విజయ్ దేవరకొండ తో రెండోసారి జోడికట్టిన డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన డియర్ కామ్రేడ్ [more]
రష్మిక మందన్న… విజయ్ దేవరకొండ తో రెండోసారి జోడికట్టిన డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన డియర్ కామ్రేడ్ [more]
రష్మిక మందన్న… విజయ్ దేవరకొండ తో రెండోసారి జోడికట్టిన డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమాకి యావరేజ్ టాక్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇక క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ గా నటిస్తే.. రశ్మిక మాత్రం స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా లిల్లీ పాత్రలో నటించింది. రశ్మిక లిల్లీ పాత్రకి 100 పెర్సెంట్ సూట్ అవడమే కాదు.. రష్మిక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయింది. విజయ్ దేవరకొండ పాత్ర కన్నా ఎక్కువగా రశ్మిక పాత్రే సినిమాలో కనబడుతుంది. అంటే సినిమా మొత్తం లిల్లీ పాత్ర చూస్తూనే తిరుగుతుంది.
ఇక లిల్లీగా రశ్మిక కి ఓ మంచి కేరెక్టర్ దొరికింది. ఈమధ్య కాలంలో హీరోయిన్స్ కి ఇలాంటి లెన్తీ పాత్రలు దొరకడం చాల కష్టమై పోయింది. అలంటి టైం లో రశ్మిక డియర్ కామ్రేడ్ లో లిల్లీ పాత్రని దక్కించుకుంది. ఆమె అందంతో పాటు నటన, విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాలో చాల తక్కువ సన్నివేశాల్లో రొమాన్స్ పండిస్తే… ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో మాత్రం పూర్తిస్థాయి రొమాన్స్ తో విజయ్ తో కలిసి అదరగొట్టేసింది. అసలు లిల్లీ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది రష్మిక. ఫస్ట్ హాఫ్ లో పక్కింటి అమ్మాయిలా సందడి చేసింది. సెకండ్ హాఫ్ లో రశ్మిక నటనకి పరీక్ష ఎదురైంది. ఎమోషన్ సీన్స్ పండించడంలోనూ, సహజంగా కనిపించడంలోనూ రశ్మిక నటన అద్భుతమని చెప్పాలి. ఇక విజయ్ తో రశ్మిక రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్. అల్లరి సన్నివేశాల్లో రష్మిక చూపులు, పేస్ ఎక్సప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. మరి ఇలాంటి పాత్రలతో తెగ హైలెట్ అవుతున్న రశ్మిక టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా మాంచి కేరెక్టర్స్ కొట్టేయడం పెద్ద కష్టంగా కనబడ్డం లేదు.