పూజ పెంచితే ఓకే గాని.. రష్మిక పెంచితేనే
ప్రస్తుతం తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే. అందుకే పూజ హెగ్డే ఎంత డిమాండ్ చేస్తే అంత పారితోషికం నిర్మాతలు ముట్టజెబుతున్నారు. మొన్నటికి మొన్న వాల్మీకి [more]
ప్రస్తుతం తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే. అందుకే పూజ హెగ్డే ఎంత డిమాండ్ చేస్తే అంత పారితోషికం నిర్మాతలు ముట్టజెబుతున్నారు. మొన్నటికి మొన్న వాల్మీకి [more]
ప్రస్తుతం తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే. అందుకే పూజ హెగ్డే ఎంత డిమాండ్ చేస్తే అంత పారితోషికం నిర్మాతలు ముట్టజెబుతున్నారు. మొన్నటికి మొన్న వాల్మీకి సినిమా సెకండ్ హాఫ్ లో మెరిసిన శ్రీదేవి పాత్ర కోసం పూజ భారీగా డిమాండ్ చేసిందనే న్యూస్ నడిచింది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాల్లో పూజ హెగ్డే నే మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ ని సూపర్ ఫామ్ లో పెట్టింది కాబట్టి. మరి రెండు హిట్స్ రెండు ప్లాప్స్ ఉండి.. ఓ స్టార్ హీరో తో కలిసి నటిస్తూ పారితోషకం పెంచేస్తే.. నిర్మాతలు లెక్క చేస్తారా మరో హీరోయిన్ ని వెతుక్కుంటారు. తాజాగా డియర్ కామ్రేడ్ తో ప్లాప్ తో ఉన్న రష్మిక, మహేష్ తో సరిలేరు నీకెవ్వరిలో నటిస్తుంది.
ఛాన్సులు వదులుకుంటుందా….?
స్టార్ హీరో తో నటిస్తున్నా కాబట్టి నెక్స్ట్ సినిమాలకు పారితోషికం పెంచేస్తే పర్లేదు అనుకున్నట్టుగా వుంది రష్మిక. అందుకే దిల్ రాజు నిర్మాణంలో చైతుతో కలిసి నటించాలంటే భారీగా పారితోషికం అడిగిందట. ముందు డేట్స్ ప్రోబ్లమ్స్ తో చైతు పక్కన నటించలేను అని అందని, కథ లో తన రోల్ ఇంపార్టెన్స్ ని బట్టి సినిమాలు ఒప్పుకుంటున్నా అనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా రష్మిక, చైతు సినిమాకి చెప్పిన పారితోషికం విన్న దిల్ రాజే రశ్మికను పక్కన బెట్టేశారట. మరి భారీ క్రేజ్ ఉన్న పూజ పెంచితే ఇస్తారు కానీ.. ఒకే స్టార్ హీరోతో నటించేస్తే క్రేజ్ వచ్చేస్తుందని రష్మిక భావించి పారితోషికం పెంచడం ఆమె కెరీర్ నే ఇబ్బందుల్లో పడేస్తుంది. మరోపక్క బాలీవుడ్ జెర్సీ లోను పారితోషికం విషయంలోనే రష్మిక ఛాన్స్ ఒదులుకుందనే న్యూస్ నడుస్తుంది.