Sat Dec 21 2024 00:26:48 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 7 : అశ్విని, రతిక అవుట్.. ఎంత సంపాదించారో తెలుసా..?
అందరూ అనుకున్నట్లు అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశారు. మరి వీరిద్దరూ ఎంత సంపాదించారో తెలుసా..?
BiggBoss 7 : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 తుదిదశకు చేరుకుంటుంది. గత వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసిన నాగార్జున ఈ వీక్ డబుల్ ఎలిమేషన్ తో ఇద్దర్ని బయటకి తీసుకు వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్ లో గౌతమ్, యావర్, అమర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక, రతిక, అశ్విని.. వీరిలో అందరూ అనుకున్నట్లు ఆ ఇద్దరే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశారు. శనివారం నాడు అశ్విని, ఆదివారం నాడు రతిక హౌస్ నుంచి బయటకి వచ్చేశారు.
వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకొని తన నామినేషన్ కి తానే పెద్ద కారణం అయ్యింది. హౌస్ లో మొత్తం ఏడు వారలు ఉన్న ఈ భామ ఎంత సంపాదించింది..? అశ్విని వీక్ కి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ చొప్పున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మొత్తం మీద దాదాపు రూ.14 లక్షల వరకు బిగ్బాస్ నుంచి తీసుకోని వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన వారులో ఇంకా అర్జున్ ఒక్కడే హౌస్ లో ఉన్నాడు.
ఇక రతిక విషయానికి వస్తే.. ఈ సీజన్ స్టార్టింగ్ లోని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోయింది. అయితే ఆరో వారం ఆమెను మళ్ళీ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో తీసుకు వచ్చి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ రతిక దానిని కూడా పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. ఫస్ట్ నాలుగు వారలు, సెకండ్ ఎంట్రీతో ఐదు వారలు.. మొత్తం మీద తొమ్మిది వారలు హౌస్ లో ఉన్న రతిక ఎంత సంపాదిందించి..?
ఈమెకు కూడా వారానికి రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తోనే హౌస్ లోకి తీసుకు వచ్చారు. ఇక తొమ్మిది వారాలకు గాను రతిక.. రూ.18 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్స్ పూర్తి అయ్యిపోగా, ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, గౌతమ్, యావర్, అమర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో మరో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. ఫినాలీ స్టేజి పైకి మొత్తం ఏడుగురిని తీసుకు రానున్నారట. ఆ వేదిక పైనే ఏడుగురిలో విజేత ఎవరో తెలియజేస్తారట.
Next Story