Sat Dec 21 2024 00:23:45 GMT+0000 (Coordinated Universal Time)
రతిక రోజ్ బిగ్‌బాస్ రీ ఎంట్రీ కన్ఫార్మ్..!
హౌస్ లోకి రతిక ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యిపోయిందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని కలగజేస్తుంది. ఉల్టా పల్టా అంటూ మొదలైన ఈ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు అర్థంకావడం లేదు. బిగ్‌బాస్ కెరీర్ లోనే మొదటిసారి వరుసగా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ బయటకి రావడం జరుగుతుంది. ఆరు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని.. ఇలా అందరూ లేడీస్ బయటకు వచ్చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా లేడీ కంటెస్టెంటే బయటకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే, గత వారం ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిన రతిక, శుభశ్రీని మళ్ళీ హౌస్ లోకి తీసుకు వచ్చి.. వాళ్లలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నారని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకోసం ఓటింగ్ కూడా నిర్వహించాడు. అయితే ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారు కాకుండా, తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ షాక్ ఇచ్చాడు. ఇక ఈ ఓటింగ్ రిజల్ట్ ని ఈ వీక్ తెలియజేయనున్నారు.
దీంతో ఎవరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకుంది. కాగా రీ ఎంట్రీ ఇచ్చేది రతిక రోజ్ అని గట్టిగా వినిపిస్తుంది. హౌస్ లోకి ఆమె ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యిపోయిందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఆమె మళ్ళీ హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. రతిక హౌస్ లోకి వస్తే గేమ్ హోరాహోరీగా జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఒకసారి మిస్ చేసుకున్న గోల్డ్ ఛాన్స్‌ని.. రతిక ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
కాగా ఈ వారం ఎలిమినేషన్ లో అమరదీప్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, పూజామూర్తి, గౌతమ్ కృష్ణ, భోలె షావళి, అశ్విని ఉన్నారు. వీరిలో పూజామూర్తి, అశ్విని తప్ప మిగిలిన వారంతా సేఫ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ వీక్ ఎవరు బయటకి రాబోతున్నారో చూడాలి.
Next Story