Sat Dec 21 2024 06:22:57 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు వారాల్లో రతిక ఎంత సంపాదించింది..?
బిగ్బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చేసిన రతిక నాలుగు వారాల్లో ఎంత సంపాదించింది..?
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 మొదలయ్యి అప్పుడే నాలుగు వారలు పూర్తి అయ్యిపోయింది. గత ఏడాది సోసోగా నడిచిన బిగ్బాస్ ఈ ఇయర్ మాత్రం మంచి ఇంటరెస్టింగా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇప్పటికి నలుగురు బయటకి వచ్చేశారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, థర్డ్ వీక్ సింగర్ దామిని బయటకు రాగా.. ఈ వీక్ రతిక (Rathika) అవుట్ అయ్యింది.
టైటిల్ రేసులో ఉంటుంది అనుకున్న రాతిక బయటకి వచ్చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే ఈ ఏడాది బిగ్బాస్ కొంచెం ఇంటరెస్టింగా ఉండడానికి కారణం రతిక అని చెప్పడంలో పెద్ద సందేహం లేదు. హౌస్ లో లవ్ ట్రాక్లు, వాటిలో కొన్ని ట్విస్ట్లు, హౌస్ మేట్స్ తో గొడవలు, అలాగే రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ స్టోరీ.. ఇలా గేమ్ మొత్తం రతిక వలన ఇంటరెస్టింగా కొనసాగేది. అలాంటి రతిక అవుట్ అవ్వడం కొంచెం షాకింగ్ అనిపించింది.
ఇక నాలుగు వారలు హౌస్ లో ఉన్న రతిక ఎంత సంపాదించింది అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకుంది. దీంతో ఈ విషయం గురించి నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజెన్స్. కాగా రతిక బిగ్బాస్ హౌస్లోకి.. వారానికి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ చొప్పున అగ్రిమెంట్ చేసుకొని ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఈ భామ నాలుగు వారాలకు గాను రూ.8 లక్షల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది.
కాగా రతిక ఎలిమినేషన్ పై సోషల్ మీడియా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్బాస్ హౌస్ లో మెయిన్ కంటెస్టెంట్ అయిన రతికని ఎలిమినేట్ చేయడం అనేది ఒక డ్రామా అని, ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీతో మళ్ళీ లోపాలకి తెచ్చే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. గత సీజన్స్ లో కూడా ఒకసారి ఒక కంటెస్టెంట్ ని ఇలానే ఎలిమినేట్ చేసి.. తనని ఒక సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.
Next Story