Mon Dec 23 2024 12:06:40 GMT+0000 (Coordinated Universal Time)
రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్స్.. ఖిలాడీ కంటే దారుణం
దసరా మినహా మరే ఇతర చిత్రంతోనూ పోటీ పడలేకపోయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి.
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర ఏప్రిల్ 7 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ పై దాని ఎఫెక్ట్ పడింది. హీరోగా రవితేజ కెరియర్ లోనే సరికొత్త క్యారెక్టర్ లో కనిపించడంతో.. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ.. ఊహించిన మేర భారీ ఓపెనింగ్స్ అయితే జరగలేదు. దసరా మినహా మరే ఇతర చిత్రంతోనూ పోటీ పడలేకపోయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. నాని హీరోగా నటించిన దసరా సినిమా 9వ రోజు కలెక్షన్లను కూడా రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్లు అధిగమించలేకపోయింది.
గతేడాది రవితేజ హీరోగా వచ్చిన కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్లు, ధమాకా రూ.9.48 కోట్లు ఫస్ట్ డే వసూళ్లు రాగా.. రావణాసురకు కేవలం ఐదున్నర కోట్ల వసూళ్లే రావడం గమనార్హం. వాటితో పోలిస్తే.. రావణాసురకు మంచి ఆరంభం రాలేదనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల వసూళ్లు రాబట్టింది. మిశ్రమ స్పందనతో ఉన్న ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ.25 కోట్లు వసూళ్లు రావాల్సి ఉంది. వీకెండ్ లో అంటే శని, ఆదివారాల్లో ఏమన్నా సినిమాకు మంచి వసూళ్లు వస్తాయోమోనని చిత్రబృందం ఎదురుచూస్తోంది. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా, రావు రమేష్, జయరామ్, సంపత్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించారు.
Next Story