Mon Dec 23 2024 07:33:31 GMT+0000 (Coordinated Universal Time)
Eagle : ఓటీటీకి వచ్చేసిన రవితేజ 'ఈగల్'.. రెండు ఓటీటీల్లో చూడొచ్చు..
రవితేజ ఈగల్ మూవీ రెండు ఓటీటీల్లో రిలీజ్ అయ్యింది. ఆ ప్లాట్ఫార్మ్స్ ఏంటి..?
Eagle : రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఈగల్’. కావ్య తపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఫిబ్రవరి 9న మంచి అంచనాలతోనే రిలీజైన ఈ చిత్రం.. థియేటర్ వద్ద మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది. దాదాపు 50 కోట్ల పైగా కలెక్షన్ ని అందుకున్న ఈ చిత్రం ఎబో ఏవరేజ్ బొమ్మగా నిలిచింది.
ఇక థియేటర్ లో ఈ సినిమా సందడి పూర్తీ అవ్వడంతో మేకర్స్.. ఇప్పుడు దీనిని ఓటీటీకి తీసుకు వచ్చేసారు. ఈ చిత్రాన్ని రెండు రెండు ప్లాట్ఫార్మ్స్లో రిలీజ్ చేసారు. ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీల్లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయ్యిన వారు ఉంటే ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఓ జర్నలిస్ట్ (అనుపమ పరమేశ్వరన్) ఓ పత్తి రైతు (రవితేజ) గురించి పేపర్ లో ఒక వార్త రాస్తుంది. అది చూసిన రా అండ్ సిబిఐ వంటి సంస్థలు ఆ జర్నలిస్ట్ ఆఫీస్ పై దాడి చేస్తారు. ఒక రైతు గురించి చిన్న వార్త రాస్తే నేషనల్ సెక్యూరిటీ సంస్థలు ఎందుకు దాడి చేసాయి అని ఆ జర్నలిస్ట్ ఆ రైతు గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెడుతుంది. ఈక్రమంలోనే ఆ రైతు ప్రపంచ దేశాలు వెతికే ఈగల్ అని తెలుస్తుంది. ఆ ఈగల్ ఎవరు..? అసలు అతని కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Next Story