Mon Dec 15 2025 00:21:28 GMT+0000 (Coordinated Universal Time)
"రామారావు ఆన్ డ్యూటీ" అప్డేట్.. త్వరలో టీజర్
"రామారావు ఆన్ డ్యూటీ" సినిమా నుంచి టీజర్ ను వదిలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది మాంచి జోరు మీదే ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాలను ఈ ఏడాది విడుదల చేయనున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి విడుదలైంది. నెక్స్ట్ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాను లైన్లో పెట్టేశాడు రవితేజ. శరత్ మండవ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 25న లేదా.. ఏప్రిల్ 15న "రామారావు ఆన్ డ్యూటీ" ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా నుంచి టీజర్ ను వదిలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా.. రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. నాజర్, నరేశ్, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
News Summary - Ravi Teja's Rama Rao On Duty Teaser Releasing Very Soon
Next Story

