Mon Dec 23 2024 04:17:11 GMT+0000 (Coordinated Universal Time)
రామారావు ఆన్ డ్యూటీ టీజర్ అదిరిందిగా !
టీజర్ అదిరిపోయింది. టీజర్ మొత్తం రవితేజ చాలా సీరియస్ గా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా, అన్యాయాన్ని సహించని..
హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. మహాశివరాత్రి సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Also Read : ఏపీ కరోనా బులెటిన్ : స్వల్పంగా పెరిగిన కేసులు
టీజర్ అదిరిపోయింది. టీజర్ మొత్తం రవితేజ చాలా సీరియస్ గా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా, అన్యాయాన్ని సహించని పోలీస్ గా కనిపిస్తున్నారు. ఆఫీస్ లో కూర్చుని సంతకాలు పెట్టడం మాత్రమే కాదు..బయటకు వెళ్లి క్రిమినల్స్ తాట తీసే అధికారిగా రవితేజ కనిపిస్తున్నాడు. 'పేరు రూపం సింపుల్ గా ఉన్నా వాడో సూపర్ మాన్' 'ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది' అనే డైలాగులు టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజకి జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తుండగా.. రాజిష కీలక పాత్రలో నటిస్తోంది.
Next Story