Mon Dec 23 2024 12:03:02 GMT+0000 (Coordinated Universal Time)
"రావణాసుర" సంక్రాంతి పోస్టర్.. ఊరమాస్ లుక్ లో మాస్ మహారాజా
తాజాగా మేకర్స్ సినిమా పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది
మాస్ మహారాజా రవితేజ మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. సుధీర్ వర్మ - రవితేజ కాంబోలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంటోంది. భోగి రోజున నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.
తాజాగా మేకర్స్ సినిమా పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పోస్టర్ విషయానికొస్తే.. పేరుకు తగ్గట్లే.. ఊరమాస్ లుక్ లో అదరగొట్టేశాడు రవితేజ. లాయర్ డ్రెస్ లో.. నోట్లో సిగార్ ని వెలిగిస్తూ కనిపించాడు. డ్రెస్ పై రక్తపు మరకలు చూస్తుంటే.. పోస్టర్ ఏదో ఫైట్ సీన్లో నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ 10 గెటప్పుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేనివారి హీరో సుశాంత్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Next Story