Mon Dec 23 2024 07:36:53 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్న రావణాసుర.. స్ట్రీమింగ్ అప్పుడే !
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం..
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. రవితేజ తొలిసారి హీరోగా నెగిటివ్ షేడ్ పాత్రలో కనిపించడం కాస్త ఆకట్టుకున్నప్పటికీ.. ఎందుకో ప్రేక్షకులు రావణాసుర కు అంతగా కనెక్ట్ అవలేకపోయారు. దాంతో థియేట్రికల్ రన్ లో రావణాసుర రెండువారాలు కూడా నిలబడలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తొలుత 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ అక్కడ ఊహించిన మేర వసూళ్లు లేకపోవడంతో.. నెలరోజుల్లోపే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాశ్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయెల్, దక్ష నాగర్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.
Next Story