Mon Dec 23 2024 08:21:11 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజ 73వ సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది
కెరియర్ పరంగా చూసుకుంటే రవితేజకి ఇది 73వ సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్ ను..
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ యాక్టివ్ హీరోల లిస్టులో రవితేజ ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి తమ్ముడిగా కనిపించి అలరించాడు. ఆ తర్వాత రావణాసురగా వచ్చి థ్రిల్ ను పంచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఈ హీరో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుగా రెడీ అవుతున్నాడు. ఒకప్పుడు స్టూవర్టుపురంలో గజదొంగగా అందరినీ గజగజలాడించిన ఒక గజదొంగ కథ ఇది.
ఈ ఏడాది అక్టోబర్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ మరో సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా చూసుకుంటే రవితేజకి ఇది 73వ సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా టైటిల్ తో కలిపి రవితేజ పోస్టర్ ను విడుదల చేశారు. ఎటు చూసినా గన్స్ .. వాటి మధ్యలో గన్ పట్టుకుని ఏదో ఆలోచన చేస్తున్న రవితేజ. మరో విధ్వంసం ఖాయమన్నట్టుగా పోస్టర్ కనిపిస్తోంది. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 2024 సంక్రాంతికి 'ఈగల్' ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Next Story