Sun Apr 27 2025 13:47:57 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజ బర్త్ డే స్పెషల్.. రామారావు ఆన్ డ్యూటీ పోస్టర్ విడుదల
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి

మాస్ మహారాజ్.. రవితేజ నేడు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న.. పలు సినిమాల నుంచి వరుస అప్ డేట్లు వస్తున్నాయి. తాజాగా రవితేజ నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ. ఇది రవితేజ 68వ సినిమా. శరత్ మండవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ లు నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్ రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు.. రొమాంటిక్, ఎంటర్ టైన్ మెంట్ కూడా సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 25వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ థియేటర్లలో విడుదల కానుంది.
News Summary - Raviteja Birthday Special Ramarao On Duty New Poster Released
Next Story