Mon Dec 23 2024 07:50:31 GMT+0000 (Coordinated Universal Time)
కొంచెం కష్టమే అయినా.. "ధమాకా" వాళ్లందరికీ అంకితం : రవితేజ
"నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022..
మాస్ మహారాజా రవితేజకు.. 2022 సంవత్సరంలో.. నవంబర్ వరకూ.. వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు భారీ అంచనాలతో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దాంతో ధమాకా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఏడాది చివర్లో వచ్చిన ఈ సినిమా.. ఇప్పటివరకూ.. రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ఫుల్ జోష్ లో ఉంది. నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు లాభాలను లెక్కపట్టే పనిలో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా.. రవితేజ తన అభిమానులకు విషెస్ చెబుతూ.. ఓ స్పెషల్ నోట్ ని ట్వీట్ చేశాడు.
"నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022 సంవత్సరంలో మనల్ని వదిలి వెళ్లిన లెజెండరీ యాక్టర్స్ కి అంకితమిస్తున్నాను. వారు లేని లోటు సినీ పరిశ్రమలో పూడ్చలేనిది. 2022 కొంచెం కష్టంగానే ఉన్నా మీ సపోర్ట్ తో ముందుకి వెళ్ళాం, ఎదిగాం. 2023లో కూడా మరింత ముందుకి మీ ప్రేమతో వెళ్లాలనుకుంటున్నాను" అని ఆ నోట్ లో పేర్కొన్నాడు రవితేజ. ఈ నోట్ పై అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. లెజెండరీ యాక్టర్స్ కు ధమాకా ను అంకితమివ్వడంపై.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం రవితేజ చేతిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నిలుస్తుందని అంచనాలున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోయే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
Next Story