Fri Nov 22 2024 21:41:00 GMT+0000 (Coordinated Universal Time)
ఆ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్.. 'రవితేజ ది గ్రేట్' అనిపించుకుంటున్నాడుగా..
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా మరో లాంగ్వేజ్ లో కూడా..
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ నెల అక్టోబర్ 20న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈక్రమంలోనే సాంగ్స్ అండ్ ట్రైలర్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇది ఇలా ఉంటే, రవితేజ ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక రవితేజ తీసుకున్న ఆ నిర్ణయానికి నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. 'రవితేజ ది గ్రేట్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రవితేజ ఏ భాషలో రిలీజ్ చేయబోతున్నాడు..? గ్రేట్ అనాల్సినంత విషయం అందులో ఏముంది..?
గ్రేట్ అనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రవితేజ ఈ సినిమాని.. మాటలురాని, వినిపించని వారి కోసం కూడా రెడీ చేస్తున్నాడు. తెలుగు టు హిందీ మొత్తం ఐదు లాంగ్వేజ్స్ తో పాటు సైన్ లాంగ్వేజ్‌లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం పట్ల.. మాటలు వినిపించని వికలాంగులు, జనరల్ ఆడియన్స్, అభిమానులు రవితేజని అభినందిస్తూ వస్తున్నారు. కాగా సైన్ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ అంటే.. అది ఎలా ఉండబోతుందని అందరిలో ఆసక్తి నెలకుంది.
స్క్రీన్ లో ఒక పక్క.. సినిమాలోని సీన్స్ అన్ని మాటలు లేకుండా ముందుకు సాగుతూ వెళ్తుంటాయి. మరో పక్క.. వచ్చే ప్రతి సీన్ ని సైన్ లాంగ్వేజ్ లో చేసి చూపిస్తూ ఉంటారు. కాగా ఈ సినిమా 19వ శతాబ్దంలోని ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ నేపథ్యంతో రాబోతుంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Next Story