Mon Dec 23 2024 07:47:58 GMT+0000 (Coordinated Universal Time)
వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్ : రావణాసుర ట్రైలర్
ట్రైలర్ లో రవితేజ ఒక క్రిమినల్ లాయర్ అని తెలుస్తోంది. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్' అనే డైలాగ్..
మాస్ మహారాజా రవితేజ తెరపై కనిపిస్తే.. అభిమానులకు సందడే సందడి. మాస్ ఇమేజ్ కి తోడు.. తన మార్క్ కామెడీతో అందరినీ ఎంటర్టైనర్ చేస్తాడు రవితేజ. అలాంటి హీరో ఈ సారి కాస్త వైలెంట్ గా కనిపించబోతున్నాయి. రవితేజ మార్క్ యాక్షన్ కు భిన్నంగా.. నెగెటివ్ షేడ్స్ తో ఆయన చేసిన సినిమానే 'రావణాసుర'. ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్లు, టీజర్ అంచనాలను క్రియేట్ చేశాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అభిషేక్ నామాతో కలిసి రవితేజ నిర్మించాడు.
తాజాగా రావణాసుర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. లవ్, కామెడీ, యాక్షన్ తో కూడిన సీన్లపై ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ లో రవితేజ ఒక క్రిమినల్ లాయర్ అని తెలుస్తోంది. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్' అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. దక్ష, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ లు ఈ సినిమాలో నటించారు. కాగా.. సుశాంత్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, జయరాం తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తోన్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కాబోతోంది.
Next Story