Mon Mar 31 2025 04:17:45 GMT+0000 (Coordinated Universal Time)
చరణ్ బర్త్ డే కి RC15 టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్
పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు రూ.170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. చరణ్ తో మరోసారి..

RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘RC15’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మరో దర్శకుడైన కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు రూ.170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. చరణ్ తో మరోసారి కియారా అధ్వాని జోడీ కడుతోంది. గీతాంజలి మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. RC15 సినిమాను ప్రకటించి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో నిరాశ ఉంది.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. RC15టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు నిర్మాత దిల్ రాజు తాజాగా స్పష్టం చేశారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపాడు. కాగా.. ఈ సినిమాకి CEO (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్), సేనాని, సైనికుడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు శంకర్ సైనికుడు టైటిల్ కి ఓటు వేస్తే, యూనిట్ లోని ఎక్కువమంది సేనాని టైటిల్ కి ఓటు వేశారని సమాచారం.
Next Story