Mon Dec 23 2024 20:05:55 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు వరుణ్-వితికా.. ఇప్పుడు మెరీనా -రోహిత్
వీరిద్దరూ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి భూపాలంతో కలిసి ఎంతో వినోదాన్ని పంచారు. తాజాగా.. ఇప్పుడు మెరీనా - రోహిత్..
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి మొత్తం 21 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరంతా ఏదోరకంగా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారే కావడం విశేషం. కొందరు యాంకర్లు, మరికొందరు కమెడియన్లు, ఇంకొందరు నటీనటులు..ఒకే ఒక్క సింగర్. ఇలా పరిచయం ఉన్న ముఖాలే హౌస్ లో కనిపించాయి. ఈసారి కంటెస్టంట్లలో ఓ జంటకూడా ఉంది. గతంలో వరుణ్ సందేశ్ - వితికా షేరు దంపతులు బిగ్ బాస్ హౌస్ లో అందరినీ అలరించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి భూపాలంతో కలిసి ఎంతో వినోదాన్ని పంచారు. తాజాగా.. ఇప్పుడు మెరీనా - రోహిత్ జోడీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెరీనా అమెరికా అమ్మాయి ధారావాహికతో పాపులారిటీ సంపాదించుకోగా.. పలు సినిమాల్లోనూ తళుక్కుమంది. ఆమె భర్త రోహిత్ సహ్నీ నీలి కలువలు, అభిషేకం సీరియల్ తో గుర్తింపు పొందాడు. ఈ జంట బిగ్ బాస్ హౌస్ లో ఎంత వినోదాన్ని పంచుతుందో చూడాలి మరి.
Next Story