ఆ మూవీ క్యాన్సిల్ కావడానికి కారణం ఆయనే..?
నిన్న మహేష్ బాబు ట్వీట్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కారణాలు వల్ల తాను సుకుమార్ సినిమా చేయలేకపోతున్నాను. కానీ అతను [more]
నిన్న మహేష్ బాబు ట్వీట్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కారణాలు వల్ల తాను సుకుమార్ సినిమా చేయలేకపోతున్నాను. కానీ అతను [more]
నిన్న మహేష్ బాబు ట్వీట్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కారణాలు వల్ల తాను సుకుమార్ సినిమా చేయలేకపోతున్నాను. కానీ అతను నేను చేసిన 1 నేనొక్కడినే సినిమా నాకు చాలా ఇష్టం…సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అల్ ది బెస్ట్ చెబుతున్నా అని ట్వీట్ చేసాడు. ఇక నిన్న సుకుమార్ – బన్నీ చిత్రం అని ఆఫిషల్ గా అనౌన్స్ చేసారు మైత్రి మూవీస్ వారు. ఆ సాయంత్రం మహేష్ తన ట్వీటర్ ఖాతాలో ఇలా ట్వీట్ చేసాడు. అయితే జనాలకు తెలియని ఓ పాయింట్ ఉంది. ఈ టోటల్ ఇష్యూ కి కారణం డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ ఆ మధ్య బన్నీకి ఓ స్టోరీ చెప్పాడు. కథ విన్న బన్నీ డెవెలప్ చేయి సినిమా చేద్దాం అని అన్నాడు. అయితే రీసెంట్ గా ఎఫ్ 2 తరువాత అనిల్.. మహేష్ కి కథ చెప్పాడు. కథ విన్న మహేష్ వెంటనే ఓకే చెప్పేసాడు. అది అక్కడ స్టార్ట్ అయింది.
అనిల్ రావిపూడి వల్లే…
తాను చేయాలనుకున్న డైరక్టర్ ను మహేష్ లాగేసాడు అని బన్నీ ఫీల్ అయ్యాడు. అందుకే తనకు ఫ్రెండ్ అయిన సుకుమార్ మహేష్ తో చేస్తున్నాడు అని తెలుసుకుని అతన్ని తన వైపు తిప్పుకున్నాడు. బన్నీ సుకుమార్ ని పిలిచి డిస్కషన్లు పెట్టి ఒప్పించగలిగారు. ఆ విధంగా మహేష్ అనుకున్న డైరెక్టర్ బన్నీ వైపు వెళ్లిపోయాడు. వాస్తవానికి బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ కి బన్నీ మధ్య చిన్నచిన్న డిఫరెన్స్ వస్తున్నాయి. అందుకే ఇంతవరకు ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా చెప్పలేదు. సుకుమార్ – అల్లు అర్జున్ ల సినిమా అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే చాలా త్వరగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అయ్యిపోవాలి. లేకపోతే మహేష్ – సుకుమార్ కి వచ్చిన క్రియేటివిటీ డిఫరెన్స్ వీరికి కూడా వస్తుంది. అనిల్ రావిపూడి చేసిన చిన్న తప్పు వల్ల ఇంత జరుగుతుంది.