Thu Dec 26 2024 10:30:21 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య తో అఖండ టీమ్.. "అన్ స్టాపబుల్" ఎంటర్టైన్ మెంట్
ఇటీవలే విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.
ఇటీవలే విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. అఖండ సినిమా రోరింగ్ హిట్ అవ్వడంలో సంగీత దర్శకుడు తమన్ కూడా ముఖ్యకారణమనే చెప్పాలి. అసలు విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సెలబ్రిటీ టాక్ షో కి ఈసారి అఖండ టీమ్ విచ్చేసి సందడి చేసింది.
అది విన్నప్పుడు కన్నీళ్లు....
అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, నటుడు శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ లు ఈ టాక్ షో లో పాల్గొనగా.. ఆ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. అఖండ ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య తన తండ్రిని గుర్తు చేసుకుని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. "నేను ఆయన కొడుకునే కాదు, ఆయన అభిమానుల్లోనూ ఒకడిని. కానీ వెన్నుపోటు పొడిచారు అంటూ ప్రచారం చేశారు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్లు వస్తాయి" అంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు.
Next Story