Mon Dec 23 2024 17:39:59 GMT+0000 (Coordinated Universal Time)
ప్రెస్ మీట్ లో ఫైర్ అయిన రెజీనా
దాంతో రెజీనా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే.
రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ గా కొరియన్ సినిమా మిడ్నైట్ రన్నర్స్ సినిమాకి కి రీమేక్ గా రూపొందిన సినిమా "శాకిని డాకిని". సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సునీత తాటి నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో రెజీనా విలేఖరులపై ఫైరయింది. ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్.. మేడమ్ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా ? అని ప్రశ్నించాడు.
దాంతో రెజీనా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్ చేయడం వల్ల మేము అలా నటిస్తాము. అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ సినిమాని తీస్తే మీరేమో నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారు. వ్యక్తిగతంగా నేను శుభ్రంగా ఉండటానికి చూస్తాను, అంతేకాని ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్ నాకేమీ లేదు. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా? అని ఫైరయింది. అనంతరం విలేఖరుల ఫోన్లు వరుసగా రింగ్ అవడంతో రెజీనా అసహనానికి గురైంది. ప్రెస్ మీట్ లో ఉన్నపుడు మీరందరూ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోరా? అంటూ ప్రశ్నించింది.
Next Story