Fri Dec 20 2024 01:38:37 GMT+0000 (Coordinated Universal Time)
Rekha Boj : ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పరిగెడతానంటున్న హీరోయిన్..
ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో నగ్నంగా పరిగెడతానంటున్న తెలుగు హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.
ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ నడుస్తుంది. సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ కి చేరుకున్న భారత్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లాస్ట్ టైం మిస్ అయిన వరల్డ్ కప్ ట్రోఫీ.. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తున్న భారత్ టీం ఫైనల్ కూడా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఒక తెలుగు హీరోయిన్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బీచ్ లో నగ్నంగా పరిగెడతాను అంటూ వైరల్ కామెంట్స్ చేసింది. మాంగళ్యం, కలాయ తస్మై నమః, దామినీ విల్లా, రంగీలా, స్వాతి చినుకు, కాత్సాయని వంటి సినిమాల్లో నటించిన రేఖా భోజ్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్టు వేసింది. "ఇండియా వరల్డ్ కప్ సాధిస్తే నేను వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా" అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
స్ట్రీకింగ్ అంటే బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్ బాల్ వంటి ఆటల్లో తమ జట్టు గెలిచినప్పుడు కొందరు పట్టలేని ఆనందంతో దుస్తులు తొలగించి పరుగులు పెడుతుంటారు. దానినే 'స్ట్రీకింగ్' అని అంటారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అదే పని చేస్తాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇండియన్ వరల్డ్ కప్ గెలవడం కంటే పట్టలేని ఆనందం ఏముంటుంది..? అంటూ రేఖా చెప్పుకొచ్చింది. ఈ బోల్డ్ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం వైజాగ్ వచ్చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రేఖా భోజ్ వైజాగ్ కైలాసపురానికి చెందిన అమ్మాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ భామ.. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ సంపాదించుకుంది. పలు తెలుగు సినిమాల్లో నటించప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో వైజాగ్ లో సొంతంగా ఓ స్టూడియో ఓపెన్ చేసి కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. గతంలో ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా టాలీవుడ్ పై హాట్ కామెంట్స్ చేసి వైరల్ అయ్యింది.
Next Story