అందుకే క్రేజ్ పెంచలేదా
భారీ క్రేజ్, భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన సాహో సినిమా మొదటి షోకే నెగెటివ్ టాక్ పడడంతో సినిమా ప్లాప్ అయ్యింది. ప్రేక్షకులకు సాహో మీదున్న [more]
భారీ క్రేజ్, భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన సాహో సినిమా మొదటి షోకే నెగెటివ్ టాక్ పడడంతో సినిమా ప్లాప్ అయ్యింది. ప్రేక్షకులకు సాహో మీదున్న [more]
భారీ క్రేజ్, భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన సాహో సినిమా మొదటి షోకే నెగెటివ్ టాక్ పడడంతో సినిమా ప్లాప్ అయ్యింది. ప్రేక్షకులకు సాహో మీదున్న భారీ అంచనాలు అందుకోవడంలో సాహో భారీగా విఫలైమైంది. ప్రభాస్ గత చిత్రం బాహుబలి బ్లాక్ బస్టర్ తో సాహో మీద ప్రేక్షకుడికి ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రేక్షకులు సాహో ని ఎక్కువ ఊహించుకోవడంతో… ప్రేక్షకులు అనుకున్నదానికన్నా తక్కువగా ఉండడంతో సినిమా ఎక్కువ రోజులు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సాహో సినిమా పరిస్థితి చూశాక.. ఈ రోజు విడుదలవుతున్న సైరా సినిమా విషయంలో మాత్రం క్రేజ్ పెంచకుండా ప్రేక్షకుడు నార్మల్ మైండ్ సెట్ తో సినిమాకి వచ్చేలా సైరా టీం ప్లాన్ చేసింది అనిపిస్తుంది.
జాగ్రత్త పడ్డారు….
అందుకే సాహో లా భారీగా సినిమాని ప్రమోట్ చెయ్యకుండా చివరి నిమిషంలో సుడిగాలి ప్రమోషన్స్ చేసింది సైరా టీం. సైరా సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడి… తీరా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుడు అనుకున్న కంటెంట్ సినిమాలో లేకపోతే… అబ్బా సినిమా అసలేం లేదు అని ప్రేక్షకుడు పెదవి విరుపు ఉంటుంది. అదే సినిమా మీద ఓ అన్నంత హోప్స్ లేకుండా… ఎలాంటి క్రేజ్ లేకుండా… ప్రేక్షకుడు మాములుగా సినిమాకి వెళ్లి చూశాక… బావుంది అంటే బావుంది అని.. లేదంటే ఓకే అని చెబుతాడు. అప్పుడు త్వరగా టాక్ స్ప్రెడ్ అవదు. అందుకే సైరా సినిమా మీద టీం ప్రేక్షకుల్లో ఓ అన్నంత క్రేజ్ పెంచకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తుంది. మరి ఈ రోజు విడుదలైన సైరా పరిస్థితి మరికాసేపట్లో తేలిపోతుంది.