Mon Dec 23 2024 16:45:09 GMT+0000 (Coordinated Universal Time)
రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. ఆ ప్రశ్న పవన్ కల్యాణ్ ను ఎందుకు అడగలేదు ?
పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఆ రోజు రేణు ‘నా కొడుకు పుట్టింది..
సుమారు 11 ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్. పవన్ తో విడిపోయినప్పటికీ ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ని వదిన అని పిలుస్తూనే ఉంటారు. ఎంత పాజిటివిటీ ఉందో.. అంతే నెగిటివిటీ కూడా ఉంది రేణు మీద. ఇటీవల ఏప్రిల్ 8న కొడుకు అకీరా పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టా గ్రామ్ లో రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై ఓ నెటిజన్ ‘మా అన్న కొడుకు.. సరిగ్గా చూపించండి’ అంటూ కామెంట్ చేయడంతో రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందు ‘మాట్లాడే పద్ధతి నేర్చుకోండి.. అకీరా నా కొడుకు’ అంటూ సీరియస్ అయ్యారు. దీనిపైనా నెటిజన్లు రేణుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి చేసిన కామెంట్స్ తాలూకు వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేశారు. అందులో మహిళల పట్ల సమాజంలో చూపిస్తున్న వివక్ష గురించి కృష్ణ కుమారి ప్రస్తావించారు. హీరో హీరోయిన్లు విడిపోతే.. సమాజం ఎప్పుడూ హీరోయిన్లదే తప్పు అని వేలెత్తి చూపిస్తుందని ఆ వీడియోలో మాట్లాడుతున్న మహిళ పేర్కొన్నారు.
‘‘పవన్ తో రేణూ దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డని కనేందుకు కూడా ముందుకొచ్చింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు. పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఆ రోజు రేణు ‘నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ కల్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు’ అని ప్రకటన చేసి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది. ఆమె ఎంతో మంచిది కాబట్టి.. పవన్ కల్యాణ్కు శిక్ష పడకుండా కాపాడింది. అలాంటి ఆవిడను పట్టుకుని ట్రోల్ చేస్తారా? ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటే తిడతారా? అదే మాట పవన్ కల్యాణ్ను ఎందుకు అడగలేకపోయారు?’’ అని కృష్ణ కుమారి నిలదీశారు.
‘‘నాకు ఈవిడ ఎవరో తెలియదు.. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్ లో నా తరపున మాట్లాడడం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడయ్యానని అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది’’ అని రేణుదేశాయ్ పేర్కొన్నారు.
Next Story