Mon Dec 23 2024 17:31:51 GMT+0000 (Coordinated Universal Time)
నేను ఆ న్యూస్ ఛానల్‌తో కలిసి పని చేసింది నిజమే.. రేణూదేశాయ్
రేణూదేశాయ్ పలానా వారికి డబ్బుకి అమ్ముడుపోయి పవన్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తుందనే వ్యాఖ్యలు పై ఆమె రియాక్షన్ ఏంటి..?
సెలబ్రిటీస్ కపుల్ విడాకులు తీసుకోని విడిపోయిన తరువాత కూడా.. వారిపై ఏదొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ వివాహ బంధం, విడాకులు విషయం అయితే పొలిటికల్ టాపిక్ అయ్యిపోయింది. పవన్, రేణూ ప్రమేయం లేకుండానే.. వీరిద్దరి చుట్టూ అనేక రూమర్స్ తిరుగుతుంటాయి. ఈక్రమంలోనే రేణూదేశాయ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకుల విషయం గురించి ఎమోషనల్ అయ్యింది.
ఆ సమయంలో పవన్ గురించి మాట్లాడిన మాటలు నెగటివ్ గా వచ్చాయి. ఇక అదే టైములో రేణూదేశాయ్ ఒక ప్రముఖ పొలిటికల్ న్యూస్ ఛానల్ తో కలిసి పని చేయడంతో నెట్టింట కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. "రేణూదేశాయ్ పలానా వారికి డబ్బుకి అమ్ముడుపోయి పవన్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తుందని" కామెంట్స్ రావడం మొదలయ్యాయి. తాజాగా దీని గురించి రేణూదేశాయ్ స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని పై ఒక క్లారిటీ ఇచ్చింది.
రేణూదేశాయ్ కామెంట్స్..
నేను గతంలో ఆ ప్రముఖ న్యూస్ ఛానల్ కోసం పని చేసింది నిజమే. అయితే మీరు అనుకున్నట్లు నా మాజీ భర్త పై విమర్శలు చేయడానికి.. నేను వాళ్ళతో కలవలేదు. రైతులు కోసం పని చేయడం కోసమే నేను వాళ్ళతో కలిసి ప్రయాణించాల్సి వచ్చింది. ఆ ఛానల్ వాళ్ళు రైతులు గురించిన ఒక ప్రోగ్రాం చేయడం కోసం నన్ను సంప్రదించారు.
నేను దర్శకురాలిని, రచయితని అని మీకు తెలుసు. రైతు బ్యాక్‌డ్రాప్‌తో నేను ఒక స్క్రిప్ట్ ని రాసుకుంటున్నాను. ఆ స్క్రిప్ట్ రీసెర్చ్ కి ఆ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని వాళ్లతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను. ఆ సమయంలో ఆ ఛానల్ తో కలిసి పలు గ్రామాల్లో ప్రయాణించాను. అంతేతప్ప వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు.
నేను ఎప్పుడు నాకు అనిపించిందే చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడ అనిపించింది అక్కడే చెప్పేస్తాను. అంతేగాని ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోయి మాత్రం వ్యాఖ్యలు చేయలేదు. ఈ మనస్తత్వంతోనే ఇటీవల నా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పాను, రాజకీయంగా నా మాజీ భర్తకే నా సపోర్ట్ అని చెప్పాను. ఆ కామెంట్స్ చేశాను కదా అని.. నేను పాలిటిక్స్ లోకి వస్తాను అనుకుంటే కూడా తప్పే.
Next Story