మళ్లీ నటనలోకి రేణు దేశాయ్
పూరి డైరెక్ట్ చేసిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు కలిసి ఉన్న [more]
పూరి డైరెక్ట్ చేసిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు కలిసి ఉన్న [more]
పూరి డైరెక్ట్ చేసిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు విడిపోయారు. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టారు రేణు దేశాయ్. రీసెంట్ గా ఆమె రెండు కొత్త ప్రాజెక్టులకు సైన్ చేశారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఒక సినిమాకు సైన్ చేశానని.. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం గా ఉందని… నేను చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నాను అని ఆమె చెప్పింది.
ఆమె పాత్రలో నటించడం గౌరవం
‘‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ డైరెక్షన్ లో సామాజికవేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో నేను నటించబోతున్నాను. సిల్వర్ స్క్రీన్ పై ఆమె పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా. అంతే కాదు మరో ముఖ్యమైన ప్రాజెక్టుకు కూడా సంతకం చేశా. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నా’ అని రేణు పోస్ట్ లో పేర్కొన్నారు. హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈమె పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది.