Mon Dec 23 2024 17:00:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీకి రేణుదేశాయ్ రీఎంట్రీ.. హేమలతా లవణం అదిరిందిగా !
తాజాగా రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆమె ఈ సినిమాలో..
టాలీవుడ్ లో ఒకప్పుడు కథానాయికగా నటించి.. ప్రేక్షకులను మెప్పించిన నటి రేణు దేశాయ్. పవన్ కల్యాణ్ తో వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. పవన్ తో విడిపోయాక కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్న రేణు.. ఇప్పుడు హేమలతా లవణం పాత్రతో రీఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఆమె రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఏంటో, ఎవరిదో తెలుసా ? మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందనే విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ప్రముఖ సామాజిక వేత్త 'హేమలతా లవణం' పాత్రలో రేణు దేశాయ్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాత్రకోసం రేణు దేశాయ్ చాలా మేకోవర్ అయిందని పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ రవితేజ సరసన నటిస్తున్నారు.
Next Story