Mon Dec 23 2024 12:18:50 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప సినిమాపై రిటైర్డ్ ఐజీ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయడం బాధాకరం
పుష్ప 1 కోసం డైరెక్టర్ సుకుమార్, అతని టీమ్ తమను చాలా అంశాలను అడిగి తెలుసుకున్నారన్నారు. వాళ్లు అడిగిన అన్నింటికీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో గతేడాది వచ్చిన పుష్ప -1 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగులోకంటే బీ టౌన్ లో ఈ సినిమా భారీ హిట్ అయింది. సినిమాలోని పాటలు, డైలాగ్స్ ప్రపంచమంతా పాపులర్ అయ్యాయి. తగ్గేదే లే డైలాగ్, ఊ అంటావా మావా పాట తెలియని వారుండరు. పార్ట్ 1 తీసినప్పుడే దానికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించగా.. ఇప్పుడు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2 నుండి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలను పెంచేసింది.
పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో, నిర్మాతల ఇళ్లలో, డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరగడం టాలీవుడ్ లో కలకలం రేపింది. ఇప్పుడు పుష్ప సినిమాపై ఓ రిటైర్డ్ ఐజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప 1 కోసం డైరెక్టర్ సుకుమార్, అతని టీమ్ తమను చాలా అంశాలను అడిగి తెలుసుకున్నారన్నారు. వాళ్లు అడిగిన అన్నింటికీ సహకరించామని తెలిపారు. అయితే సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించి, పోలీస్ అధికారులను లంచగొండులుగా చూపించడం బాధాకరమన్నారు. సెకండ్ పార్ట్ లోనైనా సుకుమార్ స్మగ్లర్ల వల్ల పోలీసులు పడే కష్టాలను చూపించాలని ఆయన కోరారు.
స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తాము కుటుంబాలను వదిలి అడవుల్లో పనిచేశామని, ఎన్నో ఇబ్బందులు పడ్డామని రిటైర్డ్ ఐజీ కాంతారావు వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాజకీయ నాయకుల ప్రమేయం ఊహాజనితం మాత్రమే. సుదీర్ఘకాలం టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పని చేసిన తనకు ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేయలేదన్నారు. ఓ పక్క ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో పుష్ప సినిమాపై రిటైర్డ్ ఐజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. ఇవి వైరల్ గా మారాయి.
Next Story