Mon Dec 23 2024 05:58:22 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ కు అదే మైనస్ అయింది : ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
భారీ విజయం సాధిస్తుందనుకున్న లైగర్ కు కనీస వసూళ్లు కూడా రాకపోవడం గమనార్హం. తాజాగా లైగర్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్..
పూరీ జగన్నాథ్ దర్శకుడిగా.. విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా.. ఇటీవల పాన్ ఇండియా సినిమాగా విడుదలైన చిత్రం లైగర్. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమాలో వరల్డ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ ఓ ముఖ్యపాత్ర చేశారు. కానీ.. సినిమాలో మైక్ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మైక్ టైసన్ పై, సినిమాపై చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. మైక్ టైసన్ లాంటి పవర్ ఫుల్ వ్యక్తితో కామెడీ క్యారెక్టర్ చేయించడంతో నెటిజన్లు ఆ సినిమాని, హీరో, డైరెక్టర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. లైగర్ ప్రమోషన్స్ లో దర్శక నిర్మాతలతో పాటు.. హీరో అప్పటికప్పుడు మాట్లాడిన మాటలు నెగివిటీని క్రియేట్ చేశాయనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ లో నడుస్తోన్న బాయ్ కాట్ ట్రెండ్ కూడా లైగర్ ఫెయిల్యూర్ కి ఒకకారణం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రజలు కరణ్ సినిమాలను బాయ్ కాట్ చేయడం మామూలైపోయింది. భారీ విజయం సాధిస్తుందనుకున్న లైగర్ కు కనీస వసూళ్లు కూడా రాకపోవడం గమనార్హం. తాజాగా లైగర్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. "హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌ల మంచితనం, స్టేజిమీద, నలుగురిలో పద్దతిగా, వినయంగా ఉండటం చూసి చాలా ఇష్టపడ్డారు. బాలీవుడ్లో అలా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది. కానీ విజయ్ మామూలుగానే స్టేజీపై దూకుడుగా ఉంటాడు. అందరినీ ఆకర్షించాలని రకరకాల చేష్టలు చేస్తాడు, లైగర్ ఈవెంట్లలో, ప్రమోషన్స్ లో విజయ్ మరీ ఓవర్ గా మాట్లాడటం కూడా ఈ సినిమాకి మైనస్ అయింది" అని ఆర్జీవీ పేర్కొన్నాడు. ఇన్నిరోజులుగా ప్రేక్షకులకు కూడా ఇదే అభిప్రాయం ఉంది. తాజాగా ఆర్జీవీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.
Next Story