Mon Dec 23 2024 13:36:04 GMT+0000 (Coordinated Universal Time)
‘వెన్నుపోటు’ విడుదల... బాబునే టార్గెట్ చేసిన ఆర్జీవీ..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను ఇవాళ విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవితంలోని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇవాళ విడుదల చేసిన పాట పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ‘కుట్ర... కుట్ర... కుట్ర’ అంటూ సాగిన ఈ పాటలో ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని, నమ్మించి మోసం చేశారని చూపించారు. ఇక, ఇవాళ నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరుగనుంది.
Next Story