Mon Dec 23 2024 20:12:12 GMT+0000 (Coordinated Universal Time)
మదర్స్ డే స్పెషల్ : నేను మంచికొడుకుని కాదంటూ ఆర్జీవీ ట్వీట్
‘‘హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ’’ అంటూ చేతిలో
హైదరాబాద్ : నేడు మదర్స్ డే (మాతృ దినోత్సవం). ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ.. తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్తూ.. విమర్శలకు గురయ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మదర్స్ డే రోజు కూడా.. ఆయన ఓ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తాను మంచి కొడుకును కాదంటూ పోస్ట్ పెట్టారు.
''హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ'' అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. వివాదాస్పద ట్వీట్లు చేసే ఆర్జీవీ.. బంధాలకు విలువివ్వనని చెప్పే ఆర్జీవీ.. ఒక్కసారిగా తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పడంతో నెటిజన్లు షాకయ్యారు. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్, మీరు మారిపోయారు సర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అసలు ఈ పోస్ట్ పెట్టింది నువ్వేనా" అని ఒక నెటిజన్ అడిగితే.. మరో నెటిజన్ "ఎంత పెద్ద ఎదవైనా అమ్మ ముందు పసివాడే"నని కామెంట్ పెట్టాడు.
Next Story