Mon Dec 23 2024 09:01:08 GMT+0000 (Coordinated Universal Time)
Vyuham : ఆర్జీవీ ‘వ్యూహం’ రిలీజ్‌కి లైన్ క్లియర్.. విడుదల ఎప్పుడంటే..?
ఆర్జీవీ ‘వ్యూహం’ రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యిపోయింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే..
Vyooham : రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా రిలీజ్ కి గత కొన్నిరోజులుగా ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయని కోర్టులో కేసు వేయడంతో రిలీజ్ కి స్టే పడింది.
దీంతో గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ చేయడం కోసం ఆర్జీవీ టీం కోర్టులో పోరాడుతూ వచ్చింది. రీసెంట్ గా జరిగిన విచారణలో సినిమాని మళ్ళీ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ పంపించాలని కోర్ట్ ఆదేశించడంతో.. చిత్ర యూనిట్ మూడోసారి సెన్సార్ అధికారుల దృష్టికి వెళ్ళింది. అయితే ఈసారి చేసిన మార్పులతో సెన్సార్ తో పాటు కోర్ట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇక అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు. కాగా ఈ సినిమా ఫస్ట్ పార్టుగా వస్తుంటే, రెండో భాగంగా 'శపథం' రాబోతుంది. అది కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి అది కూడా అన్ని అడ్డంకులు దాటుకొని రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. కాగా నేడు యాత్ర 2 సినిమా వైఎస్ జగన్ బయోపిక్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Next Story