రియా చక్రవర్తి అరెస్ట్!!
సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నటి రియా చక్రవర్తిని నేడు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. గత పది రోజులుగా.. సిబిఐ, ఈడీ [more]
సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నటి రియా చక్రవర్తిని నేడు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. గత పది రోజులుగా.. సిబిఐ, ఈడీ [more]
సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నటి రియా చక్రవర్తిని నేడు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. గత పది రోజులుగా.. సిబిఐ, ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్న రియా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే నేడు రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయంలో రియా చక్రవర్తి పార్ట్ ఎంత ఉందొ తెలియదు కానీ… ఆమె సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఒప్పుకోవడంతో ఆమెని అరెస్ట్ చేసారు. ఇప్పటికే రియా సోదరుడు సోహిల్ అరెస్ట్ అవగా.. డ్రగ్స్ కేసులో నేడు రియా కూడా అరెస్ట్ అయ్యింది.
రియా చక్రవర్తి ని సిబిఐ, ఎన్సీబీ, ఈడీ రకరకాల ప్రశ్నల్తో కన్ఫ్యూజ్ చెయ్యగా… ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. రియా చెప్పడంతోనే ఆమె సూచనల మేరకే సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ ఇచ్చినట్టు రియా సోదరుడు షాహిల్ ఒప్పుకున్నాడు. ఇక రియా కూడా సుశాంత్ కోసమే ఇదంతా చేసానని చెబుతూనే, సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఒప్పుకుంది. సుశాంత్ సింగ్ చుట్టూ డ్రగ్స్ బాబులే ఉన్నారని, సుశాంత్ డ్రగ్స్ మత్తులో మునిగితేలేవాడని, సుశాంత్ కోసమే డ్రగ్స్ ఇచ్చానని ఒప్పుకున్నా రియా చక్రవర్తి తాను మాత్రం డ్రగ్స్ తీఉస్కోలేదని.. ఎన్సీబీ ఎదుట రియా చెప్పినట్లుగా తెల్సుతుంది .బాలీవుడ్ లో రియా చక్రవర్తి మరో 25 మంది సెలబ్రిటీస్ పేర్లను ఈ డ్రగ్స్ కేసులో బయటపెట్టినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. వాళ్లెవరనేది రియా ఎన్సీబీ ఎదుట చెప్పింది అని.. వాళల్కి కూడా ఎన్సీబీ నోటీసు లు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.