Mon Dec 23 2024 00:03:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు కాంతార ఓటీటీ విడుదల తేదీ ఖరారు
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులనూ అలరించింది.సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా
చిన్న సినిమాగా వచ్చి.. దక్షిణాదిని ఒక ఊపు ఊపేసి.. భారీ వసూళ్లు రాబట్టిన సినిమా కాంతార. సినిమా విడుదలై 50 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమాకు థియేటర్లలో ఆదరణ తగ్గలేదు. మాతృభాష కన్నడలో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులనూ అలరించింది.సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా.. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్టయింది. వలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడై రికార్డు నెలకొల్పింది.
హీరో, దర్శకుడు రిషబ్ షెట్టి, హీరోయిన్ సప్తమి గౌడకు మంచి పేరు తెచ్చిపెట్టింది కాంతార. థియేటర్లలో ఇంకా ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. థియేటర్లలో వసూళ్లు ఎక్కువ వస్తుండటంతో ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. ఎట్టకేలకు వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 24వ తేదీ నుండి కాంతార సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
Next Story