Sun Dec 22 2024 23:54:27 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా.. ఎప్పుడంటే..?
కన్నడ చిత్రం 'కాంతారా' ఓ ఊపు ఊపుతోంది. వివిధ భాషల్లో డబ్ అయిన సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 రోజులు పూర్తి చేసుకున్నా.. ఈ సినిమా దేశవ్యాప్తంగా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. వీక్ డేస్‌లో కూడా సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కాంతారావు బాక్సాఫీస్ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ చిత్రం 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ కన్నడ చిత్రంగా నిలిచింది. అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాంతారా బడ్జెట్ రూ.16 కోట్లు కాగా, ఇప్పటి వరకు ఈ సినిమా 20 రోజుల్లో దాదాపు రూ.153 కోట్లు వసూలు చేసిందని అంచనా.
కన్నడ సినిమా అద్భుత విజయం సాధించడంతో అభిమానులు కాంతారా OTT విడుదల తేదీ కోసం వెతుకుతున్నారు. కాంతారా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకుంది. కాంతారా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద కాంతారా భారీ సక్సెస్ సాధిస్తూ ఉండడంతో.. OTT విడుదల తేదీని నిర్మాతలు మరింత ఆలస్యం చేయవచ్చని అంటున్నారు. సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత కాంతారావు OTT విడుదల ఉంటుందని వర్గాలు చెబుతున్నాయి. కాంతారా సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. సినిమాలో రిషబ్ శెట్టి చివరి 15 నిమిషాల నటన అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటూ ఉంది. తెలుగులో ఈ సినిమాను ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ 'గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్'లో రిలీజ్ చేశారు.
Next Story