Fri Dec 20 2024 08:20:59 GMT+0000 (Coordinated Universal Time)
అతడు నన్ను చాలా మోసం చేశాడు.. రీతూ చౌదరి
బుల్లితెర నటి రీతూ చౌదరి.. తనని ఒక వ్యక్తి చాలా మోసం చేశాడంటూ ఒక సంచలన వీడియో చేసింది.
సీరియల్స్ లో నటించి బుల్లితెర పై మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటి 'రీతూ చౌదరి'.. యూట్యూబ్, జబర్దస్త్ షోతో మరింత ఫేమ్ ని సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్, రీల్స్ షేర్ చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ని అందుకుంది. ఆ మధ్య ఒక ప్రముఖ వ్యక్తితో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్ తో బాగా ట్రెండ్ అయ్యింది. ఇక ఇటీవల రీతూ తండ్రి మరణించడంతో వాళ్ళ ఇంట తీవ్ర శోకం నెలకుంది.
ఇది ఇలా ఉంటే, తాజాగా రీతూ ఒక సంచలన వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఒక వ్యక్తి చేతిలో చాలా మోసిపోయినట్లు పేర్కొంది. అతడిని ఎవరు నమ్మకండి అంటూ అతడి ఫోటోని, వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ రీతూ ఎవరి చేతిలో మోసపోయింది..? అసలు ఏం జరిగింది..?
రీతూ చౌదరి ఒక ఆరు నెలలు క్రితం ఒక ఇంటిని కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్ వర్క్స్ ని ఓకే వ్యక్తికి ఇచ్చింది. అందుకోసం ఆ వ్యక్తి రీతూ నుంచి రూ.5 లక్షలు కూడా తీసుకున్నాడు. అయితే ఇంతలో రీతూ తండ్రి మరణించడంతో ఆమె ఇంటి పనులను సరిగ్గా పట్టించుకోలేదు. ఆ బాధ నుంచి కోలుకున్న రీతూ ఇంటి పనులపై దృష్టి పెట్టింది. నెలలు గడిచిన అక్కడి పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో రీతూ ఆ వ్యక్తిని ప్రశ్నించింది.
కానీ అతడు సమాధానం చెప్పకుండా, తిరిగి రీతూ పై ఫైర్ అయ్యాడట. ఒక పక్క నాన్నని పోగుట్టుకున్న బాధలో ఉన్న రీతూ.. తాను ఇష్టపడి కొనుకున్న ఇంటి పనులు కూడా పూర్తి కాకపోవడమే కాకుండా డబ్బులు కూడా పోవడంతో చాలా బాధ పడింది. దీంతో పోలిసులను ఆశ్రయించింది. పోలిసుల ఎంట్రీతో ఆ వ్యక్తి కొంత డబ్బుని తిరిగి ఇచ్చాడట. అయితే అతడి వల్ల తాను చాలా మోసిపోయి బాధ పడినట్లు, అలా ఇంకొకరికి జరగకూడదని ఒక వీడియో షేర్ చేసింది. అతడు ఎవరో మీరు చూసేయండి.
Next Story