Sat Nov 23 2024 01:57:37 GMT+0000 (Coordinated Universal Time)
"ఆచార్య" పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్ఎంపీ డాక్టర్లు
రెండ్రోజుల క్రితమే విడుదల చేసిన "శానా కష్టం " పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. కానీ ఇప్పుడు ఈ పాటే "ఆచార్య"ను
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఆచార్య. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్.. ఒక్కో అప్ డేట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా సినిమాలోని స్పెషల్ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితమే విడుదల చేసిన "శానా కష్టం " పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. కానీ ఇప్పుడు ఈ పాటే "ఆచార్య"ను చిక్కుల్లోకి నెట్టేసింది. ఈ పాటలో వచ్చే లిరిక్స్ లో.. ఒక లిరిక్ ఆర్ఎంపీ డాక్టర్లను కించపరిచే విధంగా ఉందంటూ ఆర్ఎంపీ వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : తెలంగాణ ఆశావర్కర్లకు శుభవార్త !
రైటర్ భాస్కరబట్ల రాసిన ఈ పాట లిరిక్స్ లో.. "ఏడేడో నిమరోచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే" అంటూ ఓ లైన్ వస్తుంది. ఇప్పుడీ లైనే ఆర్ఎంపీలకు నచ్చలేదు. అంటే యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్ అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందా లిరిక్. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు పాటలోని ఈ వాక్యాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఈ పాట తమ వృత్తిని అవమానించేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ, జనగామకు చెందిన ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాట రచయిత, దర్శకుడిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విమర్శపై ఆచార్య టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story