RoarofRRR తో రాజమౌళి మ్యాజిక్ చేసాడు
ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ లో కలిసి కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ అల్లూరి వీడియో, ఎన్టీఆర్ కొమరం భీం వీడియో ని సపరేట్ [more]
ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ లో కలిసి కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ అల్లూరి వీడియో, ఎన్టీఆర్ కొమరం భీం వీడియో ని సపరేట్ [more]
ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ లో కలిసి కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ అల్లూరి వీడియో, ఎన్టీఆర్ కొమరం భీం వీడియో ని సపరేట్ గా వదిలిన ఆర్.ఆర్.ఆర్ టీం ఇప్పుడు RoarofRRR అంటూ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసింది. ఇద్దరి హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో దాడికి దిగితే.. యూట్యూబ్ ని షేక్ చేస్తే ఎట్టా ఉంటాదో అనేది ఆర్.ఆర్.ఆర్ RoarofRRR చూపించింది.
రాజమౌళి కష్టం ఈ RoarofRRR ప్రతి షాట్ లో కనిపిస్తుంది. రాజమౌళి మేకింగ్, కీరవాణి మ్యూజిక్, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఎన్టీఆర్ యాక్షన్, రామ్ చరణ్ యాక్షన్, అలియా భట్ సీత లుక్స్, శ్రీయ లుక్, అజయ్ దేవగన్ లుక్స్, సముద్ర ఖని లుక్స్ ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సన్నివేశాలు అన్ని థియేటర్స్ లో గూస్ బంబ్స్ తెప్పించడం ఖాయం. ఆర్.ఆర్.ఆర్ కోసం వేసిన భారీ సెట్స్, పెట్టిన బడ్జెట్, ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ లు, ఆర్.ఆర్.ఆర్ కోసం పని చేసిన టెకీనికల్ టీం అన్ని ఈ RoarofRRR లో కనిపించాయి. కన్ను మూసి కన్ను తెరిచే లోపులో మాయమైన ఆర్.ఆర్.ఆర్ కేరెక్టర్స్ ని చూస్తే రాజమౌళి మరోసారి మ్యాజిక్ రిపీట్ చెయ్యడం గ్యారెంటీ కాదు పక్కా.. ఇక ఆర్.ఆర్.ఆర్ అనుకున్న డేట్ కి వచ్చెయ్యడం పక్కా ఇందులో ఎలాంటి మార్పు లేదు అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం.
- Tags
- Roar Of RRR