Mon Dec 23 2024 04:13:18 GMT+0000 (Coordinated Universal Time)
Oscars 2024 : మొదటి ఆస్కార్స్‌ని గెలుచుకున్న ఐరన్ మ్యాన్, నోలన్..
ఎట్టకేలకు ఐరన్ మ్యాన్, క్రిస్టోఫర్ నోలన్‌కి 'ఓపెన్ హైమర్' మొదటి ఆస్కార్స్‌ని తెచ్చిపెట్టింది.
Oscars 2024 : 96వ ఆస్కార్ వేడుకలు నేడు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగాయి. ఇక వేడుకల్లో 'క్రిస్టోఫర్ నోలన్' తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' చిత్రం ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఐరన్ మ్యాన్ ఫేమ్ 'రాబర్ట్ డౌనీ జూనియర్' సపోర్టింగ్ రోల్ చేయగా, 'కిలియన్ మర్ఫీ' మెయిన్ లీడ్ చేసారు. క్రిస్టోఫర్ నోలన్‌కి బెస్ట్ డైరెక్టర్‌గా, రాబర్ట్ డౌనీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, కిలియన్ మర్ఫీ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురికి ఇది మొదటి ఆస్కార్. మార్వెల్ సినిమాలతో రాబర్ట్ డౌనీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక్క ఆస్కార్ ని కూడా అందుకోలేకపోయారు. ఇంటర్ స్టెల్లెర్, ఇన్సెప్షన్, డార్క్ నైట్ వంటి సినిమాలు తెరకెక్కించి వరల్డ్ వైడ్ ఫేమస్ డైరెక్టర్ అని పేరు సంపాదించుకున్న క్రిస్టోఫర్ నోలన్ కూడా ఇప్పటి వరకు ఆస్కార్ ని అందుకోలేదు. 'ఓపెన్ హైమర్' మూవీ వీరికి మొదటి ఆస్కార్ ని తెచ్చిపెట్టింది.
కాగా ఈ ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' చిత్రం మొత్తం 7 అవార్డులను గెలుచుకుంది.
బెస్ట్ పిక్చర్ - ఓపెన్ హైమర్
బెస్ట్ డైరెక్టర్ - క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యాక్టర్ - కిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ - రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - హొయితే వాన్ హోతేమ(ఓపెన్ హైమర్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ - లుద్విగ్ గోరాన్సన్ (ఓపెన్ హైమర్)
Next Story