Mon Dec 23 2024 17:51:47 GMT+0000 (Coordinated Universal Time)
Dhanush : ధనుష్కి మద్యం అలవాటు బాగా ఉంది.. రోబో శంకర్
ధనుష్కి విపరీతమైన మద్యం అలవాటు ఉండేది అంటూ మారి మూవీ నటుడు రోబో శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Dhanush : తమిళ్ హీరో ధనుష్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాలు టాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యి హిట్స్ అందుకుంటూ ఉంటాయి. ఇలా ఆయన నటించిన 'మారి' మూవీ తెలుగులో 'మాస్'గా రిలీజ్ అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయానే అందుకుంది. దీనికి సీక్వెల్ గా మరో సినిమాని కూడా తీసుకు వచ్చారు. సీక్వెల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు.
కాగా ఈ సినిమాలో ధనుష్ పక్కన శనివారం అనే పాత్రలో నటించిన రోబో శంకర్ గుర్తుకు ఉండే ఉంటారు. ఈ మూవీతో పాటు పలు తమిళ్ చిత్రాల్లో కూడా ఈ నటుడు హీరోల పక్కన నటించి కనిపిస్తుంటారు. ఈ యాక్టర్ తాజాగా తమిళంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ నటుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. మద్యానికి బానిస అవ్వడంతో చావు అంచులు వరకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం కోలుకుంటూ మళ్ళీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు.
ఇక తాజాగా ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ధనుష్కి కూడా విపరీతమైన మద్యం అలవాటు ఉండేది. కానీ మానేద్దాం అని ఫిక్స్ అయ్యి దానిని పక్కన పెట్టేశారు. ఆ తరువాత ఆయన ఎప్పుడూ తాగలేదు. పార్టీ సమయంలో కూడా ఆయన మద్యం పెట్టుకునేవారు కాదు. అంతేకాదు ఆయన వెజిటేరియన్ కూడా. నాకు మారి సినిమాతో అవకాశం ఇచ్చి జీవితాన్ని ఇచ్చిన ధనుష్.. నన్ను మద్యం మానేమని చాలాసార్లు చెప్పారు. కానీ అది నేను వినలేదు. దాని వల్ల చావు వరకు వెళ్లి రావాల్సి వచ్చింది" అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, ఇళయరాజా బయోపిక్, శేఖర్ కముల, తన స్వీయా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేందుకు ఇది సిద్దమవుతుంది. మిగిలిన మూడు సినిమాలు ఎప్పుడూ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటాయో అనేది తెలియాల్సి ఉంది.
Next Story