Fri Dec 20 2024 18:55:51 GMT+0000 (Coordinated Universal Time)
Bubble Gum : రోషన్‌కి తండ్రిగా నటించింది.. ఆ హీరో అన్నయ్యా..?
యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన ‘బబుల్ గమ్’ సినిమాలో హీరోకి తండ్రిగా నటించింది ఆ యంగ్ హీరోకి అన్నయ్య అని తెలుసా..?
Bubble Gum : యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల 'నిర్మల కాన్వెంట్' సినిమాలో ఒక చిన్న పాత్ర చేసి వెండితెరకు పరిచయమయ్యాడు. తాజాగా ‘బబుల్ గమ్’ అనే సినిమాతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం డిసెంబర్ 29న థియేటర్ లోకి వచ్చేసింది. రోషన్ యాక్టింగ్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులే వస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో హీరో తండ్రి యాదగిరి పాత్రలో నటించిన యాక్టర్.. టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరో అన్నయ్య అని మీకు తెలుసా..? సినిమాలో ఈ తండ్రి పాత్ర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పక్కా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడే ఈ యాదగిరి పాత్ర బాగా ఎంటర్టైన్ చేసింది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరించాయి. కాగా ఈ పాత్ర చేసిన నటుడు పేరు 'చైతు'. ఇతని పూర్తి పేరు చెబితే.. అతను ఎవరు అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
తండ్రి పాత్ర చేసిన నటుడి పూర్తి పేరు 'చైతు జొన్నలగడ్డ'. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండి ఉందిగా. అవును ఈ నటుడు మన డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డకి స్వయానా అన్నయ్య. సిద్దు లాగానే.. చైతు కూడా తన అట్ట్రాక్టీవ్ స్లాంగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. స్క్రీన్ పై చైతు డైలాగ్ చెబుతుంటే సిద్ధునే గుర్తుకు వస్తున్నాడంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మొదటి సినిమా యాక్టింగ్ అని ఎక్కడా అనిపించదు. మరి ఈ కొత్త నటుడిని మన టాలీవుడ్ మేకర్స్ గమనించి.. చైతు జొన్నలగడ్డకి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. కాగా బబుల్ గమ్ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వస్తుంది. ఇప్పటి
జనరేషన్ యూత్ ని ఆకట్టుకునేలా సినిమా ఉంది.
Next Story