Fri Nov 22 2024 22:50:08 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండ పారితోషికం ఎంతో తెలుసా ?
లైగర్ సినిమాకు రూ.150 కోట్ల ఖర్చైనట్లు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పారు. విజయ్ చేసిన సినిమాల్లో..
లైగర్ సినిమా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి ఆగస్టు 25, 2017లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం హిట్ అయింది కానీ.. ఆ స్థాయి హిట్ మళ్లీ రాలేదు రౌడీ హీరోకి. అందుకే ఆగస్టు 25ని సెంటిమెంట్ గా భావించి లైగర్ ను కూడా అదే రోజు విడుదల చేసేలా ప్లాన్ చేశారు. రేపు దేశవ్యాప్తంగా లైగర్ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్ల పేరుతో అన్ని రాష్ట్రాలు తిరగడంతో.. విజయ్ కి అభిమానులు పెరిగిపోయారు. తెలుగు, హిందీ సహా పలు ప్రధాన భాషల్లో లైగర్ విడుదల కానుంది.
లైగర్ సినిమాకు రూ.150 కోట్ల ఖర్చైనట్లు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పారు. విజయ్ చేసిన సినిమాల్లో ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమా కోసం విజయ్ మూడేళ్లు కష్టపడ్డాడు. లైగర్ ముందు వరకూ విజయ్ ఒక్కో సినిమాకు రూ.6-రూ.7 కోట్ల పారితోషికం తీసుకునేవాడట. కానీ లైగర్ కు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు టాక్. ఏకంగా రూ.20-25 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. అంతే కాదు ఈ చిత్రం 'ఆర్ఆర్ ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్2' స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది.
కాగా.. విడుదలకు ముందే లైగర్ ను బాయ్ కాట్ వివాదం చుట్టుముట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుండగా.. లైగర్ పై కూడా దానిప్రభావం పడొచ్చని తెలుస్తోంది. కమర్షియల్గా 'లైగర్' బాగా రాణిస్తే, విజయ్ కి ఇక తిరుగుండదు. బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోతాడు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఖుషీ' చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే మళ్లీ పూరితో 'జన గణ మన' సెట్స్ పైకి వెళ్లనుంది.
Next Story