Mon Dec 23 2024 17:20:39 GMT+0000 (Coordinated Universal Time)
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. రౌడీ షీటర్ అరెస్ట్
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకి నిందితులు కుట్రచేసినట్లు తేలింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని..
ఇటీవల జరిగిన పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్దూని.. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్య చేయించినట్లు తేలింది. ఈ గ్యాంగ్ స్టర్ ఖాతాలో మరింతమంది సెలబ్రిటీలు ఉన్నట్లు తెలిసింది. గతంలోసల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ.. అతని తండ్రికి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ కు భద్రతను పెంచారు పోలీసులు. సల్మాన్ కూడా ఎక్కడికి వెళ్లాలన్నా.. బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తున్నారు.
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకి నిందితులు కుట్రచేసినట్లు తేలింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని హత్య చేసిన నిందితులే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రచేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. సిద్దూ హత్యకేసు నిందితుల్లో ఒకడైన కపిల్ పండిట్ ను డార్జిలింగ్ లోని ఇండో-నేపాల్ సరిహద్దులో పోలీసులు అరెస్ట్ చేసి, విచారించగా.. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ చేసినట్లు చెప్పాడు. మూడ్రోజుల పాటు రెక్కీ చేశామని, సల్మాన్ ని చంపేందుకు ప్లాన్ కూడా వేశామని చెప్పినట్లు డీజీపీ తెలిపారు. తాజా ఘటనతో సల్మాన్ కు పోలీసులు మరింత భద్రతను పెంచారు.
Next Story