Mon Dec 23 2024 02:25:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ రిలీజ్ మళ్లీ వాయిదా ? నిజమేనా ?
ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక పక్క మేకర్స్ ఏదేమైనా సరే.. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ ను విడుదల చేసి తీరుతామంటూ..
కరోనా కొట్టిన చావుదెబ్బ నుంచి సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 2021లో థియేటర్లు పూర్తిగా తెరచుకుని 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలై.. సక్సెస్ ను అందుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది నిర్మాతలకు. ఓవైపు ఏపీలో పలు థియేటర్లు మూసివేత.. మరో పక్క ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పెద్ద సినిమాలకు పెద్దకష్టాలే తెచ్చిపెట్టినట్లున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మహారాష్ట్రలో మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో నైట్ కర్ఫ్యూ విధించారు. నైట్ కర్ఫ్యూ కారణంగా రెండు షోలు రద్దైనట్లే.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ?
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక పక్క మేకర్స్ ఏదేమైనా సరే.. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ ను విడుదల చేసి తీరుతామంటూ.. ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. కానీ.. సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. భారీ మల్టీస్టారర్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తే.. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తప్పదన్న వార్తలు వినవస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ పై కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటంతో ఆర్ఆర్ఆర్ విడుదల మళ్లీ వాయిదా పడనుందన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో పాటు.. రాధేశ్యామ్ కు కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. జనవరి 14వ తేదీ రాధేశ్యామ్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. కానీ.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడవచ్చని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. ఆ రెండు సినిమాల మేకర్స్ స్పందించాల్సిందే.
Next Story