Mon Dec 23 2024 15:38:38 GMT+0000 (Coordinated Universal Time)
RRRకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
భారత్ లో సినీ పరిశ్రమలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డును..
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా RRR. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు కలెక్షన్లను కూడా భారీగా తెచ్చిపెట్టింది. కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంటూ.. రికార్డులు సృష్టిస్తోన్న RRR సినిమాను మరో ప్రతిష్టాత్మక అవార్డులు వరించింది.
ఇప్పటివరకూ వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ వచ్చిన RRR.. ఇప్పుడు దేశీయ అవార్డుల వేట మొదలుపెట్టింది. భారత్ లో సినీ పరిశ్రమలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డును RRR అందుకుంది. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ లో RRR సినిమా 2022 సంవత్సరానికి గాను ఏకంగా ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం పట్ల చిత్రయూనిట్ తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story