Mon Dec 23 2024 05:41:18 GMT+0000 (Coordinated Universal Time)
RRR విశ్వరూపం.. HCA లో ఏకంగా 5 అవార్డులు సొంతం
RRRలో నాటు నాటు పాటకి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటతోనే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి..
టాలీవుడ్ జక్కన్న.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా వచ్చిన సినిమా RRR. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తోంది. ఏ తెలుగు సినిమాకీ రాని హాలీవుడ్ అవార్డులను RRR తన ఖాతాలో వేసుకుంటుంది. అంతర్జాతీయ వేదికపై మన సినిమాకి, రాజమౌళికి, చరణ్ ఎన్టీఆర్ లకు అరుదైన గుర్తింపులు దక్కుతున్నాయి.
RRRలో నాటు నాటు పాటకి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటతోనే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి.. కొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా RRRకు మరిన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా 5 అవార్డుల్ని కొల్లగొట్టి అనేక హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టింది. గతంలో డిసెంబర్ లోనే విదేశాల్లోనూ విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR సినిమాకు HCA స్పాట్ లైట్ అవార్డు ప్రకటించారు.
శుక్రవారం రాత్రి జరిగిన అవార్డుల వేడుకల్లో.. RRR సినిమాకు ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. స్పాట్ లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో మొత్తం 5 అవార్డులను RRR సౌంతం చేసుకుంది. ఈ అవార్డులను రాజమౌళి, కీరవాణిలు అందుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ అవార్డుల ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రజెంటర్ గా ఆహ్వానితులయ్యారు. వరుసగా అవార్డులను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న RRR టీమ్ కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story