Mon Dec 23 2024 18:34:47 GMT+0000 (Coordinated Universal Time)
బాహుబలిని దాటేసిన RRR.. తొలిరోజే కలెక్షన్ల సునామీ!
నైజాంలో ఏకంగా రూ. 23.35 కోట్లు వసూలు చేసింది. అక్కడ తొలిరోజు భీమ్లా నాయక్ రూ.11.85 కోట్లు, పుష్ప రూ.11.44 కోట్లు,
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన RRR రికార్డులు సృష్టిస్తోంది. గత సినిమాల కలెక్షన్ల రికార్డులను చెరిపేసి.. వాటి స్థానంలోకి RRR వచ్చేసింది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. బాహుబలి 2 కలెక్షన్లతో సహా ఆ తర్వాత వచ్చిన సినిమాల రికార్డునూ RRR బద్దలు కొట్టింది. తొలురోజు ఏపీ, తెలంగాణ కలిపి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది RRR.
నైజాంలో ఏకంగా రూ. 23.35 కోట్లు వసూలు చేసింది. అక్కడ తొలిరోజు భీమ్లా నాయక్ రూ.11.85 కోట్లు, పుష్ప రూ.11.44 కోట్లు, రాధేశ్యామ్ రూ.10.80 కోట్లు, బాహుబలి 2 రూ.8.9 కోట్లు, వకీల్ సాబ్ రూ.8.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఆ రికార్డులన్నింటినీ RRR బద్దలు కొట్టేసింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో తొలిరోజు వసూళ్లు సాధించిన సినిమా RRR కావడం విశేషం. అలాగే దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక విదేశాల్లోనూ RRR హవా కొనసాగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో RRR భారీ వసూళ్లు రాబట్టింది. ఆస్ట్రేలియాలో బ్యాట్ మన్ రికార్డును బీట్ చేసింది RRR. అమెరికాలో తొలిరోజు 5 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది. మొత్తంమీద తొలిరోజు ఆర్ఆర్ఆర్ సినిమా రూ.257.15 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Next Story