Mon Dec 23 2024 09:37:35 GMT+0000 (Coordinated Universal Time)
RRR సినిమా వివాదం హైకోర్టుకు
RRR సినిమా వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. అల్లూరి సౌమ్య RRR సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటీషన్ వేశారు
RRR సినిమా వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. అల్లూరి సౌమ్య RRR సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటీషన్ వేశారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకకరించారని ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాల్పనిక కధతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని, ఈ సినిమా విడుదలను నిలిపేయాని కోరుతూ అల్లూరి సౌమ్య పిటీషన్ దాఖలు చేశారు.
సెన్సార్ సర్టిఫికేట్ ను....
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అల్లూరు సౌమ్య తెలంగాణ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. చరిత్రను వక్రీకరించి రూపొందించిన RRR సినిమా విడుదలయితే భవిష్యత్ తరాలకు అసలు చరిత్ర తెలియదని ఆమె పిటీషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు. RRR సినిమా కు సెన్సార్ సర్టిఫికేట్ ను కూడా రద్దు చేయాలని సౌమ్య తన పిటీషన్ లో కోరారు.
Next Story