RRR కి అప్పుడే మొదలెట్టేశారా..?
రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటించబోయే భారీ మల్టీస్టారర్ గురించి ఏదో ఒక న్యూస్ ఆ సినిమా ఉందని తెలిసినప్పటినుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కాకపోతే... గత నెల రోజులుగా రాజమౌళి బిగ్ మల్టీస్టారర్ పై ఎలాంటి న్యూస్ వినిపించకపోయే సరికి రాజమౌళి ప్రస్తుతం మగధీరని జపాన్ లో విడుదల చేసే పనులతో మల్టీస్టారర్ విషయాలను పక్కనపెట్టేనట్లుగా వార్తలొచ్చాయి. అయితే రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ RRR సినిమా వచ్చే నవంబర్ లోనే ముహూర్తం షాట్ జరుపుకుని... వెనువెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.
భారీ సెట్టింగులతో...
అయితే ఈ లోపు పూర్తి స్క్రిప్ట్ ని చేతిలో పెట్టుకుని రాజమౌళి సిద్దమవుతాడని.. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ తాజా ప్రాజెక్టులను ముగించేసి వారు కూడా ఈ భారీ మల్టీస్టారర్ కోసం రేడిగా వుంటారని తెలుస్తుంది. అయితే ఈ లోపే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు. ఒక పక్క ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ కోసం హైదరాబాద్ చివరి ప్రాంతంలో భారీ సెట్టింగ్స్ ని రాజమౌళి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారట. ఇక సినిమా మొదలైన తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ లపై సోలో సీన్స్ తెరకెక్కించి... ఆ తరువాత ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కలయికలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.
హీరోయిన్లను కూడా ఫైనల్ చేశారా...
ఇకపోతే ఈ ప్రై ప్రొడక్షన్ పనులతో పాటుగా రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలకు తగిన హీరోయిన్స్ కోసం ఇప్పటికే సెర్చింగ్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రామ్ చరణ్ కి రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్టీఆర్ కి మహానటి కీర్తి సురేష్ ని ఫైనల్ చేసే యోచనలో రాజమౌళి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక రాజమౌళి మళ్ళీ తన ఫుల్ టీమ్ తోనే అంటే ఇంక్లూడింగ్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తోనే ఈ సినిమా చెయ్యబోతున్నాడు. ఇంతకుముందు రాజమౌళి మల్టీస్టారర్ కి సెంథిల్ కెమెరామమెన్ గా చెయ్యడం లేదనే న్యూస్ నడిచింది.