Mon Dec 23 2024 19:39:28 GMT+0000 (Coordinated Universal Time)
RRR ఫస్ట్ రివ్యూ.. షాకింగ్ క్లైమాక్స్, నేషనల్ అవార్డు ఖాయమట !
చాలామంది రివ్యూని పక్కనపెట్టి.. సినిమాను నేరుగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్,
దర్శకధీరుడు రాజమౌళి.. రూ.330 కోట్ల భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా RRR. ఇంకొన్ని గంటల్లో సినిమా ప్రీమియర్ షో లతో థియేటర్లలో RRR గర్జనకు రెడీ అయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. చాలామంది రివ్యూని పక్కనపెట్టి.. సినిమాను నేరుగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్, USAలో ఇండియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, సినిమా విమర్శకుడు అయిన ఉమైర్ సంధు RRRను రివ్యూ చేస్తూ.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు, స్టేటస్ లు పెట్టారు. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ.. సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది.
RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హైలెట్ అని పొగిడారు. ఇది పవర్ ప్యాక్డ్ సినిమా అని.. క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ సినిమా క్రిటిక్. ఓ ఇండియన్ ఫిలిం మేకర్ RRR స్థాయిలో కల కనడం.. దాన్ని సెల్యూలాయిడ్ పైకి తీసుకురావడం అనేది.. భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుందన్నాడు. ఈ మూవీని ఎవ్వరు కూడా మిస్ కాకూడదన్నారు. RRRను బ్లాక్ బస్టర్ గా చెప్పుకున్నా.. మున్ముందు క్లాసిక్ గా నిలుస్తుందన్నారు.
ఫస్టాఫ్ కన్నా.. సెకండాఫ్ అల్టిమేట్ సర్ ప్రైజ్ ఇస్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫామెన్స్ కు స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందని ట్వీట్ చేశారు ఉమెయిర్ సంధు. మూవీలో వాళ్లిద్దరి మంచితనం, ఫ్రెండ్ షిప్, సోదర భావం ఎన్నటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్నకొద్దీ చాలామంది మూవీ లవర్స్ లో RRR పూనకం మొదలైంది. గత రికార్డులను చెరిపేస్తూ ఇండియాలో హయ్యెస్ట్ థియేటర్లు, స్క్రీన్లలో RRR రిలీజ్ అవుతోంది.
Next Story